Apply for Instant Loan

Download Our App

Apply for Instant Loan

Download Our App

Play Store

Apply for Instant Loan

Download Our App

Arrow Arrow

కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్

కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్ ఒక రకమైన పర్సనల్ లోన్. ఇది వ్యక్తిగత గాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, మరియు ఆధునిక గృహోపకరణాలు కొనుగోలు చేయడాన్ని సులభం చేస్తుంది. మీ ఇల్లు మరియు కిచెన్ ని వేరొక చోటకు మారుస్తున్నా లేదా అభివృద్ధి చేస్తున్నా, కొత్త ఎలక్ట్రానిక్స్ మరియు ఉపకరణాలు కోసం కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ కోసం దరఖాస్తు చేయడం మంచి ఆలోచన. ఇవి రోజూవారీ జీవితాల్ని సులభతరం చేస్తాయి.

ఆన్ లైన్ లో కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ తో కొనుగోలు చేయాల్సిన వస్తువుల జాబితా కూడా విస్త్రతంగా ఉంది. జీరో డౌన్ పేమెంట్ తో రూ. 50,000 నుండి రూ. 1,50,000కి ప్రారంభమయ్యే లోన్ ని మీరు పొందవచ్చు. ఎయిర్ కండిషనర్, రిఫ్రిజిరేటర్, మొబైల్ ఫోన్, ప్రొఫెషనల్ కెమేరా మొదలైనవి అతి తక్కువ డాక్యుమెంటేషన్ తో సులభంగా కొనుగోలు చేయవచ్చు.

కాబట్టి, వెంటనే చెల్లింపు చేసే భారం లేకుండా ఆన్ లైన్ లో కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ తో మీరు మీ జీవనశైలిని ఎందుకు అప్ గ్రేడ్ చేసుకోకూడదు మరియు ఒక సంవత్సరం తరువాత మరొక సంవత్సరం మరింత ఎందుకు సాధించకూడదు. ఇంకా, కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ కి జోడించబడిన అత్యంత ఎక్కువ పండగ ఆఫర్లు మరియు ప్రోత్సాహక ఆఫర్లు నుండి రుణగ్రహీతలు మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ఆన్ లైన్ లో కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ కోసం దరఖాస్తు చేయడానికి ఎలాంటి ప్రమాదం లేదు. ఎందుకంటే వ్యక్తిగత ఆస్థులు తాకట్టు కారణాలు కోసం ఉంచుకోబడవు.

పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయడం
Online Consumer Durable Loan
Consumer Durable Loan Apply Online

కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ కోసం హీరో ఫింకార్ప్ ఎందుకు?

ఎలాంటి భౌతికమైన డాక్యుమెంటేషన్ లేకుండా లోన్ పంపిణీ ప్రక్రియ మరియు సులభంగా రిజిస్ట్రేషన్ చేయడానికి హీరో ఫింకార్ప్ లోన్ యాప్ ఆధునిక కాలానికి చెందిన సరళమైన డిజిటల్ వేదికల్లో ఒకటిగా అర్హత పొందింది. ఇది గూగుల్ ప్లే స్టోర్ లో ఉచితంగా లభిస్తుంది ఆండ్రాయిడ్ ఫోన్స్ తో అనుకూలమైనది. కాబట్టి, కొత్త ఎలక్ట్రానిక్స్, వ్యక్తిగత గాడ్జెట్స్ మొదలైనవి కొనుగోలు చేయడానికి ఏదైనా కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ అవసరమైతే ఇప్పుడే హీరో ఫింకార్ప్ యాప్ ని డౌన్ లోడ్ చేయండి మరియు 100% సురక్షితమైన లోన్ దరఖాస్తు ప్రక్రియని ఆరంభించండి.

పోకడ మారినప్పుడు, మన వ్యక్తిగత గాడ్జెట్స్ మరియ గృహోపకరణాల్ని కూడా అప్ గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే, కొనుగోలు చేసే సామర్థ్యం లేకపోవడం వలన అప్పటికే ఉన్న వస్తువుల్ని మార్చడం ఎల్లప్పుడూ సాధ్యం కాదు. ఈ ప్రధాన కారణంగానే సాధారణ ప్రజానీకానికి కొత్త కంజ్యూమర్ డ్యూరబుల్ ఉత్పత్తులు సులభంగా లభ్యమవడానికి ఆన్ లైన్ లో కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ ని ఫైనాన్షియల్ ఇన్ స్టిట్యుషన్స్ పరిచయం చేసాయి.

హీరో ఫింకార్ప్ పర్సనల్ లోన్ యాప్ ని ఉపయోగించే రుణగ్రహీతలు రూ. 15,000 నుండి రూ. 1.5 లక్షలు వరకు వివిధ రకాల పర్సనల్ లోన్స్ ని పొందవచ్చు. కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ కూడా పర్సనల్ లోన్ గా పరిగణించబడతాయి, సరసమైన ఈఎంఐలు మరియు జీరో డౌన్ పేమెంట్ తో ఇవి సులభంగా ఆమోదించబడతాయి.

మీరు మీ నెలవారీ ఈఎంఐలు గురించి విచారిస్తుంటే, ముందస్తుగా కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్ ఇన్ స్టాల్మెంట్ గురించి తెలుసుకోవడానికి యాప్ పై లభించే ఈఎంఐ కాలిక్యులేటర్ ని మీరు ఉపయోగించవచ్చు. మీ బడ్జెట్ ప్రకారం మీరు ఈఎంఐలని సర్దుబాటు చేసుకోవచ్చు. ఖచ్చితమైన ఈఎంఐ ఫలితాల్ని సెకండ్లలో పొందడానికి అసలు లోన్ మొత్తం. వ్యవధి మరియు వడ్డీ రేట్ యొక్క వివిధ రకాలు ప్రయత్నించండి.

కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ పై వడ్డీ రేట్

కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ తక్కువ వడ్డీ రేట్ కి లభిస్తాయి. ప్రతి నెల వీటిని సులభంగా చెల్లించవచ్చు. కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ పై వడ్డీ రేట్ 10% నుండి ఆరంభమవుతుంది మరియు ఆయా రుణదాతలతో వేర్వేరుగా ఉండవచ్చు. కొన్ని ఫైనాన్షియల్ ఇన్ స్టిట్యూషన్స్ కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ ని 0% వడ్డీకి అందిస్తాయి, ప్రత్యేకించి పండగల సీజన్ లో.


వడ్డీ రేట్ తో పాటు, ఆన్ లైన్ లో ఇన్ స్టెంట్ కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ తక్కువ ప్రాసెసింగ్ ఫీజుకి వసూలు చేయబడతాయి. ఎటువంటి రహస్యమైన ఛార్జీలు లేకపోవడమే కాకుండా చాలామంది రుణదాతలు లోన్ మొత్తంలో 1-3% నామమాత్రపు ఫీజుని వసూలు చేస్తారు.

కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ కోసం కావలసిన పత్రాలు మరియు అర్హత ప్రమాణం

    కావలసిన పత్రాలు

  • కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ కోసం దరఖాస్తు ప్రక్రియలో కాగితంరహితమైన డాక్యుమెంటేషన్ ప్రమేయం గలదు. ఇది లోన్ ప్రక్రియలో తక్కువ సమయం తీసుకుంటుంది మరియు 24 గంటలలో వేగంగా ఆమోదించబడుతుంది. కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ కోసం కావల్సిన ప్రాథమిక పత్రాలు:

  • 1

    గుర్తింపు ప్రూఫ్ - ఆధార్ కార్డ్/పాన్ కార్డ్/వోటర్ ఐడీ కార్డ్/డ్రైవింగ్ లైసెన్స్

  • 2

    రెసిడెన్స్ ప్రూఫ్ - పాస్ పోర్ట్ లేదా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్

  • 3

    ఈసీఎస్ (ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సేవలు) ఆదేశం పత్రం తగిన విధంగా సంతకం చేయబడాలి మరియు మీ బ్యాంక్ శాఖ లేదా eNACH చే ధృవీకరించబడాలి. ఇది పూర్తిగా ఆన్ లైన్ ప్రక్రియ

  • మీ ఆధార్ కార్డ్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ తో లింక్ చేయబడి ఉంటే, పైన చెప్పిన పత్రాలు తప్పనిసరి కాదు.*

    అర్హత ప్రమాణం

  • కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ స్వయం ఉపాధి గల వారికి మరియు జీతాలు పొందే వారికి ఇరువురికీ అందుబాటులో ఉంటాయి. రుణగ్రహీత ఈ క్రింది అంశాలలో అర్హతని కలిగి ఉండాలి:

  • 1

    కనీస వయస్సు పరిమితి 21 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 58 సంవత్సరాలు.

  • 2

    కనీస ఆదాయం రూ. 15000 ప్రతి నెల.

  • 3

    జీతాలు తీసుకునే వారికి కనీసం పని అనుభవం 1-2 సంవత్సరాలు మరియు స్వయం ఉపాధి పొందే వారికి వ్యాపారం స్థిరత్వం ఉండాలి.

కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ యొక్క ప్రయోజనాలు.

బ్రాండెడ్ ఫోన్ కొత్త మోడల్ కి అప్ గ్రేడ్ అవడానికి లేదా టీవీ స్క్రీన్ ని పెద్దగా మరియు మెరుగ్గా మార్చాలని ఎవరు కోరుకోరు. ఈ విలాసాలు మన జీవితాల్లో భాగం మరియు మనం వాటిని తగిన ఖరీదుకి సొంతం చేసుకోవాలని కోరుకుంటాము, మనం కాదా? ఆన్ లైన్ లో కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్ కూడా అనుషంగికరహితమైన సదుపాయం. ఇది పర్సనల్ లోన్ వంటిది. ఇన్ స్టెంట్ కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్ ని నిముషాలలో పొందవచ్చు. కాబట్టి, మీ సొంత వారిని ఆశ్చర్యపరిచే బహుమతులు ఇవ్వడానికి దానిని సరైన సమయానికి ఉపయోగించడం ఒక గొప్ప ఆలోచన. కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ ఈ క్రింది ప్రయోజనాలతో ఈ సాంకేతిక ఉత్పత్తులు యొక్క కొత్త వెర్షన్ ని కొనుగోలు చేయడాన్ని సాధ్యం చేస్తాయి.


  • 100% ఉత్పత్తి విలువ

  • ఇన్ స్టెంట్ గా పంపిణీ అవుతుంది

  • అతి తక్కువ డాక్యుమెంటేషన్

  • సరళమైన తిరిగి చెల్లింపు ఎంపికలు

  • జప్తు ఛార్జీలు లేవు

  • తాకట్టు డిపాజిట్స్ లేవు


మీకు తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నట్లయితే, కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు మీరు దానిని మెరుగుపరచాలని సిఫారసు చేయబడుతుంది. ఇంకా, వివిధ ఫైనాన్షియనల్ ఇన్ స్టిట్యూషన్స్ యొక్క వారి ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ ని ఉపయోగించి వడ్డీ ధరలు, ప్రాసెసింగ్ ఫీజు, జప్తు ఛార్జీలు పోల్చండి. ఈ నియమాలు మరియు షరతుల్ని మూల్యాంకనం చేయండి మరియు మీకు ఉత్తమమైన ఒప్పందాన్ని ఇచ్చిన రుణదాతని ఎంచుకోండి.

బ్లాగ్స్
ఎఫ్ఏక్యూలు
Exclusive deals

Subscribe to our newsletter and get exclusive deals you wont find anywhere else straight to your inbox!