• Home
  • >
  • Blog
  • >
  • Personal Loan
  • >
  • రుణగ్రహీత మరణిస్తే పర్సనల్ లోన్ కి ఏమవుతుంది

రుణగ్రహీత మరణిస్తే పర్సనల్ లోన్ కి ఏమవుతుంది

జీవితం ఎంత మాత్రం ఊహించలేనిది కావడం వలన చాలామంది తమ ఆర్థిక విషయాలు గురించి ముందుగానే ప్రణాళిక చేస్తారు. దురదృష్టకరమైన పరిస్థితులు మరియు ఊహించని పరిస్థితులైన ప్రమాదం, గాయం లేదా రుణగ్రహీత మరణించడం వంటివి కుటుంబానికి ఎంతో నష్టాన్ని కలిగిస్తాయి. రుణగ్రహీత మరణించినప్పుడు లోన్ కి ఏమవుతుంది. చెల్లింపు చేసే బాధ్యతని ఎవరు తీసుకుంటారు? రుణగ్రహీత లేనప్పుడు ఆర్థిక సంస్థలు తమ ఈఎంఐలని ఏ విధంగా స్వాధీనం చేసుకుంటాయి? పర్సనల్ లోన్ తీసుకున్నప్పుడు మరియు రుణగ్రహీత జీవించనప్పుడు మరియు చెల్లింపు చేయడం కష్టమైన పరిస్థితిలో  ఈ సాధారణ ప్రశ్నలు అన్నీ తలెత్తుతాయి.

లోన్ వ్యవధి మధ్యలో రుణగ్రహీత మరణించినప్పుడు ఏమి చేయాలో పర్సనల్ లోన్ పత్రంలో వివరించే తమ సొంత క్లాజ్ లు వివిధ ఆర్థిక కంపెనీలకు ఉంటాయి. సాధారణంగా, అలాంటి కేసులలో, నిర్ణయించబడని లోన్ మొత్తాన్ని కుటుంబం యొక్క చట్టబద్ధమైన వారసులు చెల్లిస్తారు. ఒకవేళ మరణించిన రుణగ్రహీతకి ఆమె/అతని పేరులో జీవిత బీమా ఉన్నట్లయితే, బీమా కంపెనీ పర్సనల్ లోన్ ని చెల్లిస్తుంది మరియు రుణగ్రహీత యొక్క ఎవరైనా కుటుంబ సభ్యుని పై ఎటువంటి భారం ఉండదు.
 

రుణగ్రహీత మరణించిన తరువాత రుణదాతలు పర్సనల్ లోన్ ని ఏ విధంగా స్వాధీనం చేసుకుంటారు?


మరణించడానికి గల కారణంతో సంబంధం లేకుండా, మరణించిన రుణగ్రహీత కుటుంబం లేదా సహ-దరఖాస్తుదారు పర్సనల్ లోన్ ని స్వాధీనం చేసుకోవడాన్ని సంప్రదించడానికి సరైన ఆధారం. పర్సనల్ లోన్ ని చెల్లించడానికి నిర్దేశించబడిన చెల్లింపు సమయం మంజూరు చేయబడుతుంది. చట్టబద్ధమైన వారసులుచే లోన్ చెల్లించబడకపోతే, రుణదాతకి రుణగ్రహీత యొక్క భౌతిక అంశాల్ని అనగా వాహనం లేదా ఆస్థి వంటివి స్వాధీనం చేసుకుని మరియు పర్సనల్ లోన్ స్వాధీనం రాబట్టుకునే   హక్కు ఉంటుంది.
To Avail Personal Loan
Apply Now

పర్సనల్ లోన్ రుణగ్రహీత పేరులో ఉన్నట్లయితే ఏమిటి జరుగుతుంది?


మరణించిన వారికి చట్టబద్ధమైన వారసులు లేనప్పుడు మరియు పర్సనల్ లోన్ ని కేవలం రుణగ్రహీత పేరుతో మాత్రమే తీసుకున్నప్పుడు, లోన్ నిర్వాహకుడు అప్పుని తీర్చడానికి రంగప్రవేశం చేస్తారు. నిర్వాహకుడు తన సొంతంగా డబ్బులు వెదజల్లుతాడని భావించరాదు, బదులుగా రుణాన్ని తీర్చడానికి రుణగ్రహీత ఆస్థులు ఉపయోగించబడతాయి.
 

రుణగ్రహీత మరణించిన తరువాత పర్సనల్ లోన్ రుణాన్ని చెల్లించడానికి ఉన్న ప్రక్రియ ఏమిటి?

 
  • రుణగ్రహీత మరణం గురించి క్రెడిటర్/రుణదాతకి తెలియచేయాలి, లేనట్లయితే, ఈఎంఐలు సాధారణ రూపంలో చెల్లించబడాలని పరిగణించబడతాయి
  • చెల్లించవలసిన పూర్తి మరియు అంతిమ బకాయి మొత్తం గురించి రుణదాతని అభ్యర్థించాలి
  • రుణగ్రహీతకి పర్సనల్ లోన్ బీమా లేదా జీవిత బీమా  ఆమె/అతని పేరుతో ఉన్నదా అని తనిఖీ చేయాలి. రుణాన్ని చెల్లించడానికి దానిని ఉపయోగించవచ్చు
  • బీమా లేనట్లయితే, ఏదైనా ఆస్థి లేదా భూమి వంటివి వారు సొంతంగా కలిగి ఉన్నారా అని లోన్ నిర్వాహకుడు రుణగ్రహీత కుటుంబాన్ని సంప్రదించాలి 
  • ఆస్థులు రుణాల్ని చెల్లించడానికి సరిపోకపోతే, పర్సనల్ లోన్ రుణగ్రహీత పేరులో ఉన్నప్పుడు మాత్రమే మిగిలిన బ్యాలెన్స్ రద్దు చేయబడుతుంది

To Avail Personal Loan
Apply Now